'హైడ్రా'కు మ‌రో కీల‌క బాధ్య‌త!

  • న‌గ‌రంలో నిత్యం ఎక్క‌డో ఒక‌చోట ఆక్ర‌మ‌ణ‌ల‌ కూల్చివేత‌ల‌తో దూసుకెళుతున్న హైడ్రా
  • ప్ర‌భుత్వం మంజూరు చేసే బిల్డింగ్ ప‌ర్మిష‌న్ల ప్ర‌క్రియ‌లోనూ హైడ్రాను చేర్చే యోచ‌న‌
  • ఇళ్ల నిర్మాణాల‌కు హైడ్రా వ‌ద్ద కూడా ఎన్ఓసీ పొందాల‌నే కొత్త నిబంధ‌న దిశ‌గా ప్ర‌భుత్వం
ప్ర‌భుత్వ భూముల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం, చెరువుల‌ను ర‌క్షించ‌డం కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా (హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ)ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం హైడ్రా న‌గ‌రంలో నిత్యం ఎక్క‌డో ఒక‌చోట ఆక్ర‌మ‌ణ‌ల‌ కూల్చివేత‌లు చేప‌డుతూ వార్త‌ల్లో నిలుస్తోంది. 

ఈ క్ర‌మంలో తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌భుత్వం మంజూరు చేసే బిల్డింగ్ ప‌ర్మిష‌న్ల ప్ర‌క్రియ‌లోనూ హైడ్రాను చేర్చాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. న‌గ‌రంలో ఇళ్ల నిర్మాణాల‌కు ఇక నుంచి హైడ్రా వ‌ద్ద కూడా ఎన్ఓసీ పొందాల‌నే కొత్త నిబంధ‌న‌ను అనుమ‌తుల ప్ర‌క్రియ‌లో చేర్చే యోచ‌న‌లో స‌ర్కార్ ఉంద‌ట‌. 

కాగా, బ‌ఫ‌ర్ జోన్‌, ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో హైడ్రా అనుమ‌తి లేకుండా ఎవ‌రైనా అక్ర‌మ నిర్మాణాలు చేప‌డితే ఆ ఇంటి నెంబ‌ర్, క‌రెంట్‌, న‌ల్లా క‌నెక్ష‌న్ల‌ను తొల‌గించ‌నున్న‌ట్లు స‌మాచారం. 

పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు న‌ష్ట‌పోకుండా ఉండేందుకే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లో వ‌చ్చే అవ‌కాశం ఉంది.


More Telugu News