అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు రావచ్చు.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
- నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు
- తొలి డిబేట్‌లో హోరాహోరీగా తలపడ్డ ట్రంప్, కమలా హ్యారిస్
- ట్రంప్ విధానాలను ఎండగడుతూ దూకుడు ప్రదర్శించిన కమల
- డిబేట్‌లో ట్రంప్‌పై ఆమె చేసిన ఎదురుదాడిని మెచ్చుకున్న కేటీఆర్
- కమల నిజమైన అధ్యక్ష అభ్యర్థి అంటూ ప్రశంస
నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో రెండు ప్రధాన పార్టీలు డెమొక్రాటిక్, రిపబ్లికన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. వరుసగా రెండోసారి గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని డెమొక్రాట్లు భావిస్తుంటే.. 2020లో చేజారిన అధికారాన్ని తిరిగి సాధించాలని రిపబ్లికన్లు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ బుధవారం తొలి డిబేట్‌లో పాల్గొన్నారు. ట్రంప్‌తో జరిగిన ఈ ముఖాముఖి చర్చలో కమల దీటుగా బదులిచ్చారు.
ఇలా ఈ డిబేట్‌లో ట్రంప్‌పై ఆమె చేసిన ఎదురుదాడిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. కమల నిజమైన అధ్యక్ష అభ్యర్థి అంటూ పొగిడారు. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.
"కమలా హ్యారిస్ నిజమైన దేశాధ్యక్ష అభ్యర్థి అనిపించారు. ఈ ఏడాది చివర్లో అమెరికాకు ఆమె తొలి మహిళా అధ్యక్షురాలు కావచ్చు" అని కేటీఆర్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం కేటీఆర్ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.