చంద్రబాబు నేటి ఏలూరు, కాకినాడ పర్యటన షెడ్యూల్ ఇలా..!

  • కైకలూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే
  • అనంతరం తమ్మిలేరు బ్రిడ్జి పరిశీలన
  • కాకినాడ జిల్లా రాజుపాలెంలో రైతులు, నివాసితులతో చంద్రబాబు మాటామంతీ
  • సామర్లకోట టీటీడీసీలో ఎగ్జిబిషన్ స్టాళ్ల పరిశీలన
  • సాయంత్రం 6.40 గంటలకు ఉండవల్లి చేరుకోవడంతో పర్యటనకు ముగింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు ఏలూరు, కాకినాడలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 10.50 గంటలకు ఏలూరు జిల్లాలోని కైకలూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. 11.10 గంటలకు ఏలూరులోని సర్ సీఆర్ రెడ్డి డిగ్రీ కాలేజీలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 11.25 గంటలకు ఏలూరు అర్బన్‌లోని తమ్మిలేరు బ్రిడ్జి వద్దకు చేరుకుని పది నిమిషాల పరిశీలన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 11.45 గంటలకు తిరిగి సీఆర్ రెడ్డి కాలేజీ ఆడిటోరియంకు చేరుకుంటారు. 12.15 గంటల వరకు అక్కడ రైతులు, వరద బాధితులతో మాట్లాడతారు.

అనంతరం 1.05 గంటలకు సామర్లకోట జూనియర్ కాలేజీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ 40 నిమిషాలపాటు ఉండి అనంతరం బయలుదేరి 2.15 గంటలకు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని రాజుపాలెం చేరుకుంటారు. అక్కడ రైతులు, నివాసితులతో చంద్రబాబు మాట్లాడతారు. అనంతరం 2.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.20 గంటలకు సామర్లకోటలోని టీటీడీసీకి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను సీఎం పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సామర్లకోట హెలిప్యాడ్‌కు చేరుకుని 4.15 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.15 గంటలకు వెలగపూడి సెక్రటేరియట్‌కు చేరుకుంటారు. 6.40 గంటలకు ఉండవల్లితోని తన నివాసానికి చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.


More Telugu News