భారతీయ విద్యార్థులకు కెనడా షాక్.. సగానికి తగ్గనున్న స్టడీ వీసాలు!
- 2024లో అంతర్జాతీయ విద్యార్థుల కోసం 2,31,000 స్టడీ వీసాలను ఆమోదించే అవకాశం ఉందన్న 'అప్లైబోర్డ్' నివేదిక
- 2023లో కెనడా ఆమోదించిన స్టడీ పర్మిట్ల సంఖ్య 4,36,000
- 2023తో పోలిస్తే 2024లో కెనడియన్ స్టడీ పర్మిట్ల కోసం గ్లోబల్ అప్లికేషన్‌లలో 39శాతం తగ్గుదల
- ఇప్పటికే కొత్త వలస విధానం, విదేశీ విద్యార్థుల వారపు పనిగంటల తగ్గింపుతో ఇక్కట్లు
కెనడాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే కొత్త వలస విధానం, విదేశీ విద్యార్థుల వారపు పనిగంటలను జస్టిన్ ట్రూడో ప్రభుత్వం తగ్గించింది. దీంతో అక్కడ ఉన్న మన వారిపై ఆర్థిక భారం పెరిగింది. ఇప్పుడు ఈ ఏడాది ఇండియన్ స్టూడెంట్స్ స్టడీ పర్మిట్ ఆమోదాలు దాదాపు 50శాతం మేర తగ్గుతాయని కెనడా ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ అప్లైబోర్డ్ నివేదిక తాజాగా అంచనా వేసింది.
2018, 2019లో వచ్చిన విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో కెనడియన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదిక పేర్కొంది. దీంతో ఈ ఏడాది స్టడీ పర్మిట్ల ఆమోదాల క్షీణత ఏర్పడిందని తెలిపింది. అప్లైబోర్డ్ నివేదిక నుండి వచ్చిన ఈ సమాచారాన్ని ది గ్లోబ్ అండ్ మెయిల్ మంగళవారం ప్రచురించింది.
"ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారత్ నుండి స్టడీ పర్మిట్ల ఆమోదాలు సగానికి తగ్గాయి" అని నివేదిక పేర్కొంది. ఇది పూర్తి ఏడాది ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలలతో అంతర్జాతీయ విద్యార్థులను అనుసంధానించే సంస్థ అప్లైబోర్డ్ నివేదిక. 2023లో ఆమోదించబడిన విదేశీ విద్యార్థుల స్టడీ వీసాల సంఖ్య 4,36,000గా ఉంది. కానీ, 2024లో ఇప్పటివరకు కేవలం 2,31,000గా ఉందని నివేదిక తెలిపింది.
దీని ప్రకారం 2023తో పోలిస్తే 2024లో కెనడియన్ స్టడీ పర్మిట్ల కోసం గ్లోబల్ అప్లికేషన్‌లలో 39శాతం తగ్గుదల ఉందని నివేదిక అంచనా వేసింది.
ఇక 2022లో కెనడాలోని 5.5 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులలో 2.26 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే 3.2 లక్షల మంది భారతీయులు స్టూడెంట్ వీసాలపై కెనడాలో ఉంటూ గిగ్ వర్కర్లుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించారు.
అంతర్జాతీయ విద్యార్థులకు ఆర్థిక అవసరాలను పెంచేలా (ఇటీవల విద్యార్థుల పని గంటలను తగ్గించడం) కెనడియన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు చాలా మంది భావి విద్యార్థులను నిరుత్సాహపరిచాయని అప్లైబోర్డు సీఈఓ, సహ వ్యవస్థాపకుడు మేటి బసిరి తెలిపారు.
" కెనడా ఒకప్పుడు అంతర్జాతీయ విద్యార్థులను స్వాగతించిన విధంగా ఇటీవల కాలంలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు" అని బసిరిని ఉటంకిస్తూ ది గ్లోబ్ అండ్ మెయిల్ పేర్కొంది. దాంతో చాలామంది విదేశీ విద్యార్థులు ఇప్పుడు కెనడాకు స్టడీ పర్మిట్ల కోసం దరఖాస్తు చేయడం లేదు. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి ఇతర గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారు.