త్వరలోనే 'ఆపరేషన్ బుడమేరు' చేపడుతున్నాం: మంత్రి నారాయణ

  • బుడమేరులోని ఆక్రమణలు తొలగిస్తామన్న నారాయణ
  • వరద బాధితులకు ఆహారం, తాగునీరు లోటు లేకుండా చూశామని వెల్లడి
  • 77 వేల విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించామన్న మంత్రి
విజయవాడను ముంచెత్తిన బుడమేరులో ఉన్న ఆక్రమణలు తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. త్వరలోనే 'ఆపరేషన్ బుడమేరు' చేపడుతున్నామని... ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని వెల్లడించారు. విజయవాడ వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీలో ఎలాంటి లోటు లేకుండా చూశామని చెప్పారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

పారిశుద్ధ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని నారాయణ తెలిపారు. ఇప్పటి వరకు 77 వేల విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించామని చెప్పారు. కలుషితమయ్యే అవకాశం ఉన్నందున, వరద ప్రాంతాల్లోని నీటిని మరో రెండు రోజుల వరకు తాగొద్దని ప్రజలకు సూచించామని తెలిపారు. వరద బాధితులు పూర్తిగా కోలుకునేంత వరకు ఆహారాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు.


More Telugu News