ఆ రోజున రమ్యకృష్ణ ఏడ్చేసింది: దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి

  • సౌందర్య గురించి ప్రస్తావించిన ఎస్వీ కృష్ణారెడ్డి 
  • అలా మాట్లాడినందుకు చాలా ఫీలైందని వ్యాఖ్య
  • 'ఆహ్వానం' సినిమా గురించిన ప్రస్తావన 
  • రమ్యకృష్ణను అలా సాగనంపామని వెల్లడి        


ఎస్వీ కృష్ణారెడ్డి కెరియర్ తొలినాళ్లలోనే, తన సినిమాలన్నీ కుటుంబ సమేతంగా చూడదగినవిగా ఉంటాయని చెప్పారు. అదే మాటకు ఆయన కట్టుబడి ఉన్నారు. ఆయన నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. ఒక దర్శకుడు .. సంగీత దర్శకుడిగా కూడా సక్సెస్ కావడమనేది ఎస్వీ కృష్ణారెడ్డి విషయంలో జరిగింది. 

కృష్ణారెడ్డి సినిమాలలో హీరోయిన్ పాత్రలకి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందువలన ఆయన సినిమాలలో నటించడానికి స్టార్ హీరోయిన్స్ కూడా ఉత్సాహాన్ని కనబరిచేవారు. ఇదే విషయాన్ని 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ప్రస్తావించారు. 'యమలీల' సినిమాలో అలీ జోడీగా చేయనని చెప్పిన సౌందర్య, ఆ తరువాత అందుకు చాలా ఫీలైంది. ఆ తరువాత 'మాయలోడు'లో బాబుమోహన్ తో సాంగ్ చేయడానికి కూడా ఆమె అడ్డుచెప్పలేదు" అని అన్నారు. 

"ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి నాకు తెలియదు. నేను వాటి జోలికి వెళ్లను .. అలాంటి విషయాలను పట్టించుకోను. స్త్రీలను గౌరవంగా చూడటం మాత్రమే నాకు తెలుసు. 'ఆహ్వానం' సినిమాలో రమ్యకృష్ణగారు చేశారు. చివరి రోజున షూటింగు పూర్తి చేసుకుని ఆమె వెళ్లిపోతుంటే, వెండి పళ్లెంలో పట్టుబట్టలు పెట్టి .. ఆ పైన పదివేల రూపాయలు పెట్టి .. ఆమెకు బొట్టు పెట్టి పంపించాము. ఆ సమయంలో ఆమె ఏడ్చేశారు .. ఆ దృశ్యం నాకు ఇప్పటికీ గుర్తుంది" అని అన్నారు. 



More Telugu News