చివరి ప్రయత్నం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత దేవినేని అవినాశ్.. నేడు విచారణ
- మంగళగిరి టీడీపీ కార్యాయలం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా దేవినేని అవినాశ్
- ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్
- సుప్రీం తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నిందితుడు దేవినేని అవినాశ్ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి పలువురు వైసీపీ నేతల మెడకు చుట్టుకుంది. ఇదే కేసులో ఇటీవల మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అవినాశ్ ఇప్పటికే ఓసారి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆయనను హైదరాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు నుంచి ముందస్తు బెయిలు కోసం ప్రయత్నించగా కోర్టు అందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం నేడు విచారించనుంది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుపైనే ఉంది.