రిజర్వేషన్‌ల అంశంపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
- భారత్‌లో అన్ని వర్గాల వారికి పారదర్శక అవకాశాలు లభించే పరిస్థితులు వచ్చాక రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచిస్తుందన్న రాహుల్
- ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు ఇప్పటికీ సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని వ్యాఖ్యలు
- కామన్ సివిల్ కోడ్ పై ప్రస్తుతం స్పందించనన్న రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వరుస సమావేశాల్లో పాల్గొంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అన్ని వర్గాల వారికి భారత్‌లో పారదర్శక అవకాశాలు లభించే పరిస్థితులు వచ్చిన తర్వాత రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత్ లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని రాహుల్ అన్నారు. అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కూడా అంతంతమాత్రంగా ఉందని పేర్కొన్నారు. కామన్ సివిల్ కోడ్ గురించి ప్రశ్నించగా, దానిపై తాను ఇప్పుడే స్పందించలేనని రాహుల్ సమాధానమిచ్చారు. అమెరికాలో ప్రతిష్టాత్మక జార్జ్ టౌన్ యూనివర్శిటీలో విద్యార్ధులను ఉద్దేశించి జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.