పార్టీ ఫిరాయించే వాళ్ల సభ్యత్వాలను ఆటోమేటిక్ గా రద్దు చేయాలి: కూనంనేని
- పార్టీ మారే ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు పెట్టాలన్న కూనంనేని
- సొంత పార్టీ నచ్చకపోతే.. పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లాలని వ్యాఖ్య
- మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం కిరాతకంగా చంపుతోందని విమర్శ
పార్టీ ఫిరాయింపుదారులను ఉద్దేశించి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ పార్టీ నుంచి గెలుపొంది, మరో పార్టీలో చేరే ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాలను ఆటోమేటిక్ గా రద్దు చేయాలని ఆయన చెప్పారు. ఒక పార్టీపై అభిమానంతో వారికి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మోసం చేసినందుకు... అలాంటి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. పార్టీ ఫిరాయింపుదారుల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. ఏ ఎమ్మెల్యేకైనా సొంత పార్టీ నచ్చకపోతే... ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేసి ఇతర పార్టీలోకి వెళ్లాలని అన్నారు.
వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యేగా తన ఒక నెల జీతం రూ. 2.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నానని కూనంనేని చెప్పారు. వరదలను కేంద్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించి కనీసం రూ. 10 వేల కోట్లను అందించాలని డిమాండ్ చేశారు.
ఎన్ కౌంటర్ల పేరుతో మావోయిస్టులను అత్యంత కిరాతకంగా చంపుతూ కేంద్ర ప్రభుత్వం ఆటవిక యుద్ధానికి తెరలేపిందని కూనంనేని విమర్శించారు. ఈ హింసను వెంటనే ఆపేయాలని కోరారు. ఎన్ కౌంటర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే మావోయిస్టులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాలని సూచించారు.