తెలంగాణ మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి సతీవియోగం
- లక్ష్మారెడ్డి భార్య శ్వేత కన్నుమూత
- కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్వేత
- గత ఎన్నికల్లో ఓటమిపాలైన లక్ష్మారెడ్డి
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య డాక్టర్ శ్వేత మృతి చెందారు. కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆమెను నిన్న రాత్రి ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.
లక్ష్మారెడ్డి హోమియోపతి వైద్యుడిగా పని చేశారు. జడ్చర్ల నియోజకవర్గం నుంచి 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇంధన, ఆరోగ్య శాఖల మంత్రిగా పని చేశారు. గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన లక్ష్మారెడ్డి ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ సమయంలోనే ఆయన భార్య అనారోగ్యానికి గురి కావడం జరిగింది. శ్వేత మృతి పట్ల బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంతాపం ప్రకటిస్తున్నారు.