తెలంగాణకు ఐదో వందే భారత్ ట్రైన్ .. 15న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం

  • సికింద్రాబాద్ – నాగ్‌పూర్ మధ్య పట్టాలపై పరుగులు తీయనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్
  • ఈ నెల 15న వర్చువల్ పధ్ధతితిలో ప్రారంభించనున్న ప్రధాని  
  • నాగ్‌పూర్‌కు కేవలం ఏడు గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుందన్న కిషన్ రెడ్డి 
తెలంగాణ నుండి ఇప్పటికే పలు ప్రాంతాలకు నాలుగు వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తుండగా, మరో రైలు (ఐదో) పట్టాలపై పరుగులు పెట్టడానికి సిద్ధమవుతోంది. సికింద్రాబాద్ – నాగ్ పూర్ మధ్య ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ సేవలు అందించేందుకు మూహూర్తం ఫిక్సయింది. ఐదో వందేభారత్ ట్రైన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15న వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. 
 
ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ రెండు నగరాల మధ్య 578 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఏడు గంటల 15 నిమిషాల్లో పూర్తి చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ ట్రైన్.. నాగ్ పూర్‌లో ఉదయం 5 గం.లకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1 గంటకు సికింద్రాబాద్‌లో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్ పూర్ చేరుకోనుంది. కాజీపేట, రామగుండం, బల్లార్షా, చంద్రపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుందని తెలిపారు.


More Telugu News