వినేశ్ ఫొగాట్ రాజకీయాల్లోకి రావడంపై స్పందించిన మహావీర్ ఫొగాట్

  • వినేశ్ రాజకీయాల్లోకి రావడంపై మహావీర్ అభ్యంతరం
  • 2028‌లో గోల్డ్ మెడల్ సాధించడంపై దృష్టి సారించాల్సిందని సూచన
  • వినేశ్ తన లక్ష్యంపై దృష్టి సారించాలన్న మహావీర్ ఫొగాట్
వినేశ్ ఫొగాట్ రాజకీయ ఆరంగేట్రం చేయడంపై ద్రోణాచార్య అవార్డ్ గ్రహీత, రెజ్లింగ్ మాస్టర్ మహావీర్ ఫొగాట్ స్పందించారు. ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం కంటే 2028 ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడంపై దృష్టి సారిస్తే బాగుండేదన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

పిల్లల నిర్ణయాలు పిల్లలవేనని, పెంచి పోషించడం వరకే మన కర్తవ్యమన్నారు. వినేశ్ తదుపరి ఒలింపిక్స్‌కు కూడా వెళ్లే ప్రయత్నం చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఆమె రాజకీయాల్లోకి రావడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 2028 ఒలింపిక్స్‌లో పాల్గొని ఆమె దేశానికి గోల్డ్ మెడల్ సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వినేశ్ తన లక్ష్యంపై దృష్టి సారించాల్సింది అన్నారు.


More Telugu News