హెల్త్, లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపుపై తదుపరి భేటీలో నిర్ణయం?
- హెల్త్, లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియంపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ
- దీనిని తగ్గించే అంశంపై జీఎస్టీ కౌన్సిల్‌లో ఏకాభిప్రాయం
- జీఎస్టీని తగ్గిస్తే వచ్చే లాభనష్టాలపై నివేదిక ఇచ్చిన ఫిట్‌మెంట్ కమిటీ
హెల్త్, లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని తగ్గించే అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ ఉంది. దీనిని తగ్గించే అంశంపై జీఎస్టీ కౌన్సిల్‌లో ఏకాభిప్రాయం వచ్చిందని, అయితే తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పన్ను అధికారులతో కూడిన ఫిట్‌మెంట్ కమిటీ ఈరోజు లైఫ్, హెల్త్, రీఇన్స్యూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని తగ్గిస్తే కలిగే లాభనష్టాలను జీఎస్టీ కౌన్సిల్ ముందు ఉంచింది. జీఎస్టీ తగ్గింపుపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ తదుపరి భేటీలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాల్లో హెలికాప్టర్ సేవలపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.