నష్టాల్లో ప్రారంభమై... లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 375 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
  • 84 పాయింట్ల లాభాల్లో ముగిసిన నిఫ్టీ
  • లాభాల్లో 1576 స్టాక్స్, నష్టాల్లో 2300 స్టాక్స్ ముగింపు
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కోలుకున్నాయి. సెన్సెక్స్ 375 పాయింట్లు లాభపడి 81,559 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు ఎగిసి 24,936 వద్ద స్థిరపడ్డాయి. 1576 సూచీలు లాభాల్లో, 2300 నష్టాల్లో ముగియగా, 130 స్టాక్స్‌లో మార్పు లేదు.

నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో హెచ్‌యూఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్ ఉన్నాయి. నిఫ్టీ టాప్ లూజర్స్‌లో ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, హిండాల్కో ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, బీపీసీఎల్ ఉన్నాయి. రంగాలవారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ సూచీలు 1 శాతం చొప్పున లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్, ఐటీ, మెటల్, టెలికాం, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, రియాల్టీ 0.3 శాతం నుంచి 1 శాతం మేర క్షీణించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.3 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.6 శాతం క్షీణించింది.


More Telugu News