ఎమ్మెల్యే కామినేనికి తృటిలో తప్పిన ప్రమాదం

  • వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే
  • ఓ వాగును దాటుతుండగా పక్కకు ఒరిగిన బొలెరో
  • ఎమ్మెల్యేను జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకొచ్చిన సిబ్బంది
ఆంధ్రప్రదేశ్ లో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిన విషయం తెలిసిందే. దీంతో సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే వరద బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న బొలెరో వాహనం ఓ వాగు దాటుతుండగా ఒక్కసారిగా కంట్రోల్ తప్పింది. వరద తీవ్రతకు ఓ పక్కకు ఒరిగింది. 

దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది... బొలెరో నుంచి ఎమ్మెల్యేను కిందికి దింపారు. ఆపై జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చారు. ఆలపాడు - కొల్లేటికోట రహదారి పూర్తిగా నీట మునిగిందని తెలిసి ఎమ్మెల్యే కామినేని వరద బాధితులను పరామర్శించేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో పందిరిపల్లిగూడెం గ్రామంలో కొల్లేరు సరస్సులో వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి ఈ ప్రమాదం ఎదురైంది.




More Telugu News