‘బుడమేరు’ రెడ్ అలర్ట్.. ఏ క్షణమైనా వరద ముంచెత్తే ప్రమాదం
- లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారుల హెచ్చరిక
- వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ అప్రమత్తం
- బుడమేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు
బుడమేరుకు మరోమారు ముప్పు పొంచి ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చెప్పారు. ఈ వర్షాల కారణంగా బుడమేరుకు ఏ క్షణమైనా వరద ముంచెత్తే ప్రమాదం ఉందన్నారు.
ఈమేరకు సోమవారం ఉదయం బుడమేరు పరీవాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించి, ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా గుణదల, సింగ్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలందరూ వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని ధ్యానచంద్ర ఆదేశించారు.