గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం చంద్రబాబు
- రాజ్ భవన్ లో గవర్నర్ తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వక భేటీ
- వరద పరిస్థితులు, సహాయక చర్యలపై వివరణ
- స్వయంగా పర్యవేక్షించడం పట్ల చంద్రబాబును అభినందించిన గవర్నర్
ఏపీ సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఈ మర్యాదపూర్వక భేటీలో... సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని వరద పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను గవర్నర్ కు వివరించారు.
వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమించిందని, రాత్రింబవళ్లు నిరంతరం పనిచేసి భారీ స్థాయిలో సహాయ, పునరావాస చర్యలు చేపట్టినట్టు గవర్నర్ కు తెలియజేశారు.
దీనిపై గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పందిస్తూ... వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస చర్యలను స్వయంగా సీఎం చంద్రబాబు పర్యవేక్షించడాన్ని అభినందించారు.