ప్రకాశం బ్యారేజి వద్ద మరమ్మతు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బోట్లు ఢీకొనడంతో దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజి గేట్లు
- కౌంటర్ వెయిట్లు అమర్చిన నిపుణులు
- కొనసాగుతున్న మిగిలిన మరమ్మతు పనులు
- నిపుణుడు కన్నయ్యనాయుడుతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం ప్రకాశం బ్యారేజిని సందర్శించారు. అక్కడ జరుగుతున్న గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు. వరదల కారణంగా కొన్ని బోట్లు కొట్టుకువచ్చి ప్రకాశం బ్యారేజి గేట్లను బలంగా ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దాంతో 67, 69 నెంబరు గేట్లకు డ్యామేజి అయింది.
ఈ నేపథ్యంలో, దెబ్బతిన్న గేట్లకు నిన్న కొత్త కౌంటర్ వెయిట్లు అమర్చారు. మిగిలిన మరమ్మతు పనులు కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో, ప్రకాశం బ్యారేజి వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల నిపుణుడు కన్నయ్య నాయుడితో మాట్లాడారు. కొత్తగా అమర్చిన కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనులపై ఆరా తీశారు. అనంతరం, ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా నది వరద ప్రవాహాన్ని పరిశీలించారు.