హైడ్రా రానక్కర్లేదు.. ఆ షెడ్‌ను మేమే తొలగిస్తాం: మురళీ మోహన్

  • గచ్చిబౌలిలోని రంగలాల్‌కుంట చెరువు బఫర్‌జోన్‌లో జయభేరి షెడ్
  • కూల్చివేతకు 15 రోజుల సమయమిచ్చిన హైడ్రా
  • మంగళవారం సాయంత్రం లోపు తామే కూల్చేస్తామన్న మురళీమోహన్
  • తానెప్పుడూ ఆక్రమణలకు పాల్పడలేదని వివరణ
జయభేరి సంస్థకు వచ్చిన హైడ్రా నోటీసులపై సీనియర్ నటుడు మురళీమోహన్ స్పందించారు. హైడ్రా నోటీసులు నిజమేనని తెలిపారు. జయభేరి ఎక్కడా, ఎప్పుడూ ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని పేర్కొన్నారు. స్థానికుల ఫిర్యాదుతోనే హైడ్రా అధికారులు తమ సైట్‌కు వచ్చి పరిశీలించారని తెలిపారు. తమ రేకుల షెడ్డు బఫర్ జోన్‌‌లో మూడు అడుగుల మేర ముందుకు వచ్చినట్టు గుర్తించారని పేర్కొన్నారు.

గచ్చిబౌలిలోని రంగలాల్‌కుంట చెరువు బఫర్ జోన్‌లోకి ఈ షెడ్ వస్తుందని చెప్పారు. ఆ షెడ్‌ను తామే తొలగించేస్తామని, హైడ్రా రానక్కర్లేదని వివరణ ఇచ్చారు. నిజానికి ఈ షెడ్ తొలగించేందుకు జయభేరికి హైడ్రా 15 రోజుల సమయం ఇచ్చింది. లేదంటే తామే తొలగిస్తామని హెచ్చరించింది. దీంతో స్పందించిన మురళీమోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైడ్రా రానక్కర్లేదని మంగళవారం సాయంత్రం లోపు తాత్కాలిక షెడ్‌ను తొలగిస్తామన్నారు. తాను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, ఏనాడూ అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు.


More Telugu News