తన కేసు వార్తలు తెలుసుకోవాలట!.. జైలులో కన్నడ నటుడు దర్శన్‌కు టీవీ సౌకర్యం!
- అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, నటి పవిత్రగౌడ సహా 17 మంది అరెస్ట్
- తన కేసు అప్‌డేట్స్ గురించి తెలుసుకునేందుకు టీవీ కావాలని జైలు అధికారులకు అభ్యర్థన
- ఇటీవల పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్లారి జైలుకు మార్పు
అభిమాని హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ప్రస్తుతం బళ్లారి జైలులో ఉన్నాడు. తొలుత పరప్పన అగ్రహార జైలులో ఉన్న అతడికి అక్కడ రాచ మర్యాదలు లభిస్తుండడంతో జైలు అధికారులు ఆగస్టు 29న బళ్లారి జైలుకు తరలించారు. ఇప్పుడక్కడ అతడికి టీవీ సౌకర్యం కల్పించనున్నారు.
తన కేసుకు సంబంధించి ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు తనకు టీవీ కావాలని జైలు అధికారులను అతడు అభ్యర్థించాడు. ఈ నేపథ్యంలో దర్శన్ ఉంటున్న సెల్‌లో టీవీ సౌకర్యం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. కాగా, బెంగళూరు పోలీసులు ఇటీవలే దర్శన్, నటి పవిత్ర గౌడ సహా 17 మందిపై 3,991 పేజీల చార్జ్‌షీట్‌ను సమర్పించారు.
తన కేసుకు సంబంధించిన అప్‌డేట్స్‌ను తెలుసుకునేందుకు టీవీ సెట్ కావాలని దర్శన్ అభ్యర్థించాడని, జైలు మార్గదర్శకాల ప్రకారం అతడి సెల్‌లో సోమవారం టీవీ ఏర్పాటు చేస్తామని జైలు అధికారులు తెలిపారు.