హీరో నితిన్ కు పుత్రోదయం

 
టాలీవుడ్ హీరో నితిన్, షాలిని దంపతులు తల్లిదండ్రులయ్యారు. నితిన్ అర్ధాంగి షాలిని మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నితిన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మా ఫ్యామిలీలో కొత్త స్టార్ కు స్వాగతం అంటూ ఫొటో షేర్ చేశారు. 

కాగా, తండ్రయిన నితిన్ కు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు వెంకీ అట్లూరి తదితరులు నితిన్ కు శుభాకాంక్షలు తెలిపారు. నితిన్, షాలినిల వివాహం కరోనా సంక్షోభం కొనసాగుతున్న సమయంలో జరిగింది. 2020లో వారు పెళ్లితో ఒక్కటయ్యారు.


More Telugu News