రాజకీయాలు పక్కన పెట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సచివాలయానికి వెళ్లాను: బండి సంజయ్
- వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్న బండి సంజయ్
- వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టం జరిగిందని వెల్లడి
- ఇది రాజకీయాలతో కూడిన సమస్య కాదని స్పష్టీకరణ
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో తాను రాజకీయాలను పక్కన పెట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సచివాలయానికి వెళ్లానని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం రేవంత్ రెడ్డి తదితరులతో కలిసి వరదలపై సచివాలయంలో జరిగిన సమీక్షలో బండి సంజయ్ పాల్గొన్నారు. సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టం సంభవించిందన్నారు. కేంద్రం ప్రతి విషయాన్ని పరిశీలిస్తుందని తెలిపారు. వరద నష్టంపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక అందిందన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇచ్చిన నివేదికలను పరిశీలించిన అనంతరం రెండు రాష్ట్రాలకు కేంద్రం సాయం అందిస్తుందన్నారు.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రాజకీయం చేయడం సరికాదన్నారు. ఇది రాజకీయాలతో కూడిన సమస్య కాదని వ్యాఖ్యానించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయాల్సిన బాధ్యత అందరిదీ అన్నారు.
ఎస్డీఆర్ఎఫ్ నిధులు రూ.1,345 కోట్లు ఉన్నాయని, వీటిని గత ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోయిందని విమర్శించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళతామన్నారు. తెలుగు రాష్ట్రాలను ఆదుకుంటామని శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారన్నారు.