దర్శన్ అభిమాని హత్య కేసు... చార్జిషీటులో ఆసక్తికర అంశాలు
- నటి పవిత్ర గౌడతో కన్నడ హీరో దర్శన్ సహజీవనం
- అభిమానిని కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడినట్టు ఆరోపణలు
- జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న దర్శన్, పవిత్ర గౌడ తదితరులు
- 3,991 పేజీలతో చార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు
కన్నడ హీరో దర్శన్ సొంత అభిమానిని హత్య చేసిన కేసులో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శన్, నటి పవిత్ర గౌడ సహజీవనం చేస్తుండగా... పవిత్ర గౌడకు దర్శన్ అభిమాని రేణుకాస్వామి సందేశాలు పంపడం... దర్శన్, అతడి అనుచరులు రేణుకాస్వామిని పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపినట్టు ఆరోపణలు రావడం సంచలనం సృష్టించాయి.
ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడ, తదితరులు అరెస్టయి జైల్లో ఉన్నారు. కాగా, ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన 3,991 పేజీల చార్జిషీట్ లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. పవిత్ర గౌడకు రేణుకాస్వామి అసభ్య సందేశాలు పంపాడని చార్జిషీట్ లో పేర్కొన్నారు.
"నువ్వు చాలా హాట్ గా ఉన్నావు... ప్లీజ్ నీ నెంబరు పంపించు... నాలో ఏం చూడాలనుకుంటున్నావు? అది నీకు పంపించనా?... వావ్, సూపర్ బ్యూటీ... నాతో రహస్యంగా సహజీవనం చేస్తావా? నీకు ప్రతి నెలా రూ.10 వేలు ఇస్తాను" అంటూ రేణుకాస్వామి పంపిన మెసేజ్ లు ఆ చార్జిషీట్ లో ఉన్నాయి. అంతేకాదు, రేణుకాస్వామి తన మర్మాంగాల ఫొటోలను కూడా ఆమెకు పంపించాడని చార్జిషీట్ లో పేర్కొన్నారు.
దారుణమైన రీతిలో రేణుకాస్వామి మెసేజ్ లు పంపుతుండడంతో పవిత్ర గౌడ ఈ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో, ఈ కేసులో మరో నిందితుడైన పవన్ సాయాన్ని కోరింది. ఈ సందేశాలు పంపుతున్నది ఎవరో తేల్చుకునేందుకు పవన్... నటి పవిత్ర గౌడ పేరుతో అతడితో చాటింగ్ మొదలుపెట్టాడు. ఆ విధంగా రేణుకాస్వామికి సంబంధించిన వివరాలు సేకరించి, అతడ్ని కిడ్నాప్ చేసి అంతమొందించారని పోలీసులు ఆ చార్జిషీట్ లో వివరించారు.