'అడవి రాజా' మూవీ ముచ్చట్లు: నిర్మాత కైకాల నాగేశ్వరావు

1986లో వచ్చిన 'అడవిరాజా'
ఆ సినిమాను నిర్మించిన కైకాల బ్రదర్
కథ వినగానే శోభన్ ఒప్పుకున్నారని వెల్లడి  
 'మసినగుడి'లో ఫారెస్ట్ సీన్స్ చిత్రీకరణ

శోభన్ బాబు కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో 'అడవి రాజా' ఒకటి. కె. మురళీ మోహన్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమానుకి, కైకాల సత్యనారాయణ సోదరుడు నాగేశ్వరరావు నిర్మించారు. 1986 అక్టోబర్లో వచ్చిన ఈ సినిమా, ఘనవిజయాన్ని సాధించింది. రాధా కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఏనుగు .. కోతి కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించడం వలన పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అలాంటి ఈ సినిమాను గురించి, తాజాగా 'తెలుగు వన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కైకాల నాగేశ్వరావు ప్రస్తావించారు. 

"శోభన్ బాబుగారితో ఒక సినిమా చేయాలనుకున్నాము. ఇద్దరు హీరోయిన్స్ కథలు కాకుండా కొత్తగా ఏదైనా కథ చేస్తే బాగుంటుందని భావించాము. అడవి నేపథ్యంతో కూడిన కథలను శోభన్ బాబుగారు ఇంతవరకూ చేయలేదు కదా అనే ఆలోచన వచ్చింది. ఫారెస్టు బ్యాక్ గ్రౌండ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ .. కమర్షియల్ అంశాలు ఉండాలని నిర్ణయించుకున్నాము. 'హాథీ మేరే సాథీ'ని ప్రేరణగా తీసుకుని ఒక కథను సిద్ధం చేయించాము" అని అన్నారు. 

"శోభన్ బాబుగారిని కలుసుకున్నాం .. ఇది ఆయన రెగ్యులర్ గా చేసే కథ కాదని చెప్పాము. ఫారెస్టు ఏరియాలో స్టే చేయవలసి ఉంటుందని అన్నాము. ఎందుకంటే మద్రాసులో మాత్రమే చేయడం ఆయనకు అలవాటు. ఆయన కూడా ఉత్సాహాన్ని చూపించారు. ఫారెస్టుకు సంబంధించిన సీన్స్ ను తమిళనాడు - 'మసినగుడి'లో చిత్రీకరించాము. శోభన్ బాబుగారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ వసతి సౌకర్యాలు దొరికాయి" అని చెప్పారు. 



More Telugu News