కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా
- హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్లు
- రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీతో భేటీ అయిన ఫొగట్, పునియా
- జులానా నియోజకవర్గం నుంచి ఫొగాట్ పోటీ చేస్తారని ప్రచారం
భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వారు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని ఢిల్లీలోని ఆయన నివాసంలో రెండు రోజుల క్రితం కలిసిన రెజ్లర్లు... ఈరోజు ఆ పార్టీలో చేరారు. వారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగుతారనే ప్రచారం సాగుతోంది.
వినేశ్ ఫొగాట్ జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో జేజేపీ నుంచి అమర్జీత్ దిండా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనపై ఫొగాట్ పోటీ చేయనున్నారు. బజరంగ్ పునియా కాంగ్రెస్ స్థానమైన బద్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా ఈ రోజు ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు.