రైల్వేలో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన వినేశ్ ఫోగట్
- కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు రెజ్లర్‌పై వార్తలు
- ఈ క్రమంలో 'ఎక్స్' వేదికగా తన రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ప్రకటన
- నార్తర్న్ రైల్వేస్‌లో ఓఎస్‌డీగా వినేశ్ ఫోగట్ విధులు
- భారతీయ రైల్వేలకు సేవ చేయడం గర్వించదగిన సమయమన్న వినేశ్
రెజ్లర్ వినేశ్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వినేశ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రైల్వేస్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు.
"భారతీయ రైల్వేలకు సేవ చేయడం నాకు మరపురాని, గర్వించదగిన సమయం. అయితే, ఇప్పుడు రైల్వే సర్వీస్‌కు రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాను. భారతీయ రైల్వే ఉన్నతాధికారులకు నా రాజీనామాను సమర్పించాను" అని వినేశ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
కాగా, నార్తర్న్ రైల్వేస్‌లో వినేశ్ స్పోర్ట్స్ కోటాలో లెవల్-7లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ) గా విధులు నిర్వహించారు.
ఇదిలాఉంటే.. వినేశ్ ఫోగట్‌తో పాటు మరో స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరికీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇవాళ హస్తం పార్టీలో చేరుతున్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తల వేళ ఇప్పుడు వినేశ్ రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం చర్చానీయాంశంగా మారింది.
ఇక పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల ఫ్రీస్టైల్ 50 కిలోల విభాగంలో వంద గ్రాముల అధిక బరువు కారణంగా ఫైనల్‌కు ముందు వినేశ్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దాంతో త్రుటిలో పతకాన్ని కోల్పోయిందామె.