నా ఫాస్టెస్ వన్డే శతకం సచిన్ బ్యాట్ వల్లే: షాహిద్ అఫ్రిది
- నైరోబీలో శ్రీలంకతో మ్యాచ్‌లో కేవలం 37 బంతుల్లోనే సెంచరీ బాదిన అఫ్రిది
- దీనికి కారణం సచిన్ బ్యాట్ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన మాజీ ఆల్ రౌండర్
- ప్రస్తుతం వన్డేల్లో వేగవంతమైన సెంచరీ రికార్డు ఏబీ డివిలియర్స్ (31 బంతుల్లో) పేరిట నమోదు
పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది అత్యుత్తమ అటాకింగ్ బ్యాటర్‌లలో ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు క్రీజులోకి వస్తే బౌండరీల వర్షం కురవాల్సిందే. క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లను హడలెత్తించేవాడు. ఇక క్రీజులో కుదురుకుంటే అంతే సంగతులు. అందుకే చాలా కాలంపాటు అఫ్రిది పేరిట ఉన్న ఓ రికార్డు చెక్కుచెదరలేదు. అదే వన్డేల్లో అత్యంత వేగవంతమైన శతకం.
నైరోబీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బూమ్ బూమ్ అఫ్రిది కేవలం 37 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దాంతో వన్డే క్రికెట్‌లో ఫాస్టెస్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
అయితే, 2014లో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కోరీ అండర్సన్ 36 బంతుల్లో సెంచరీ సాధించి అఫ్రిది రికార్డును బద్దలు కొట్టాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ 2015లో వెస్టిండీస్‌పై 31 బంతుల్లో శతకం నమోదు చేయడం ద్వారా అండర్సన్ రికార్డును బద్దలు కొట్టాడు.
అయితే, తాజాగా ఈ రిటైర్డ్ పాకిస్థాన్ స్టార్ తన సెంచరీ వెనుక ఉన్న సీక్రెట్‌ను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 37 బంతుల్లోనే సెంచరీ సాధించేందుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాట్‌ను ఉపయోగించినట్లు అఫ్రిది స్వయంగా వెల్లడించాడు.
"ఆ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్‌ను భద్రంగా ఉంచాను. ఆ బ్యాట్ చరిత్ర సృష్టించింది. అది సచిన్ టెండూల్కర్ బ్యాట్. అతను నా అభిమాన ఆటగాళ్లలో ఒకడు. అతని బ్యాట్‌తో నేను ప్రపంచ రికార్డు సృష్టించాను. ఈ సందర్భంగా నేను వకార్ యూనిస్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే నేను మ్యాచ్‌కి ముందు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బ్యాట్‌ని ఆయనే నాకు అందించాడు. ఆ బ్యాట్‌తోనే బరిలోకి దిగాలని నన్ను ప్రోత్సహించాడు" అని షాహిద్ అఫ్రిది చెప్పుకొచ్చాడు.