బీజేపీలో చేరిన రవీంద్ర జడేజా: పార్టీ సభ్యత్వ కార్డును షేర్ చేసిన భార్య రివాబా

  • 2019లో బీజేపీలో చేరిన రివాబా జడేజా 
  • 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన రివాబా
  • జామ్ నగర్ నార్త్ నుంచి విజయం సాధించిన రివాబా
భారత క్రికెటర్ రవీంద్ర జడేజా ఈరోజు బీజేపీలో చేరినట్లు ఆయన భార్య రివాబా జడేజా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రివాబా జడేజా ఇప్పటికే గుజరాత్‌లో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. తన భర్త సభ్యత్వం కార్డును ఆమె పోస్ట్ చేశారు. 2019లో రివాబా బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్‌లోని జామ్‌నగర్ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

బార్బడోస్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్‌లో భారత్ గెలిచిన ఒకరోజు తర్వాత జూన్ 29న రవీంద్ర జడేజా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 

దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సెప్టెంబర్ 2వ తేదీన ఢిల్లీలో ప్రారంభించడం తెలిసిందే. ప్రధాని మోదీ తొలి సభ్యత్వాన్ని తీసుకోవడం ద్వారా పార్టీలో తన ప్రాథమిక సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసుకున్నారు.


More Telugu News