మూడ్నాలుగు రోజులుగా చంద్రబాబును చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది: చిన్నజీయర్ స్వామి
- విజయవాడలో వరదలు
- సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్న చంద్రబాబు
- చంద్రబాబు ఓపికను మెచ్చుకున్న చిన్నజీయర్ స్వామి
- ఆయనకు భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నామని వెల్లడి
ఏపీలో వరద పరిస్థితులు, ప్రభుత్వ సహాయక చర్యలపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి స్పందించారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్న తీరును అభినందించారు. గత మూడ్నాలుగు రోజులుగా వరద బాధితుల కోసం చంద్రబాబు చేపడుతున్న సహాయక చర్యలు, అర్ధరాత్రి వేళ కూడా ముంపు ప్రాంతాల్లో తిరిగే ఆయన ఓపిక తమకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని అన్నారు.
ఇలాంటి విపత్కర సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు యువకుల కంటే ఉత్సాహంగా పనిచేస్తున్నారని కొనియాడారు. సమయాన్ని వ్యర్థం చేయకుండా, అనేక సహాయక చర్యలు చేపడుతూ ప్రజలకు ఆపన్నహస్తం అందిస్తుండడం సంతోషదాయకమని పేర్కొన్నారు.
"ఆయన మరింత ఆరోగ్యంగా ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగే శక్తి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాం. గతంలో విశాఖపట్నంలో హుద్ హుద్ తుపాను తీవ్ర ప్రభావం చూపినప్పుడు, ఎంత శీఘ్రగతిన పునరుద్ధరణ చేశారో, ఈసారి విజయవాడ పరిసర ప్రాంతాలను కూడా అంత వేగంగా పునరుద్ధరిస్తున్నారు" అని చిన్నజీయర్ స్వామి వివరించారు.