బాలకృష్ణ స్వర్ణోత్సవం లైవ్ లో వివాదం అనేది సోషల్ మీడియా కల్పితం: 'శ్రేయాస్' శ్రీనివాస్
- ఇటీవల హైదరాబాదులో బాలకృష్ణ స్వర్ణోత్సవ కార్యక్రమం
- కార్యక్రమం ప్రారంభమైన కాసేపటికే మీడియా చానళ్లలో లైవ్ నిలిపివేత
- సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామన్న శ్రేయాస్ శ్రీనివాస్
టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల హైదరాబాదులో ఘనంగా గోల్డెన్ జూబ్లీ వేడుక నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి సహా ఇతర కథానాయకులు, సీనియర్ దర్శకులు, యువ దర్శకులు... ఇలా బాలయ్య కార్యక్రమానికి చాలామంది విచ్చేశారు.
అయితే, ఈ కార్యక్రమం లైవ్ పై వివాదం నెలకొంది. కొన్ని మీడియా చానళ్లలో కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే లైవ్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో, ఈవెంట్ నిర్వాహక సంస్థ శ్రేయాస్ మీడియా అధినేత 'శ్రేయాస్' శ్రీనివాస్ స్పందించారు.
నందమూరి బాలకృష్ణ@50 స్వర్ణోత్సవం ఈవెంట్ లైవ్ లో వివాదం అనేది సోషల్ మీడియా కల్పితం అని స్పష్టం చేశారు. ఆ కార్యక్రమ కంటెంట్ ప్రసార హక్కులు శ్రేయాస్ మీడియా వద్ద ఉన్నాయని వెల్లడించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తాము ఖండిస్తున్నామని శ్రేయాస్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.