సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు: వీడియో బయటపెట్టిన బాధితురాలు

  • ఏపీ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు
  • ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • నేడు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో వివరాలు వెల్లడి
ఆంధ్రప్రదేశ్ సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. తిరుపతిలోని ఓ హోటల్ లో ఎమ్మెల్యే తనపై జరిపిన లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోను బయటపెట్టింది. దీనిపై ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. సీఎంకు రాసిన లేఖను మీడియాకు విడుదల చేసింది. 

తిరుపతిలోని హోటల్ లో...

ఎమ్మెల్యే ఆదిమూలం బెదిరింపులతో జులై 6న తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ హోటల్ కు వెళ్లానని బాధితురాలు తెలిపింది. రూమ్ నెంబర్ 109 లో సాయంత్రం 4 గంటలకు ఆదిమూలం తనపై అఘాయిత్యం చేశాడని, మళ్లీ 17న మరోమారు అదే హోటల్ రూమ్ నెంబర్ 105 లో మధ్యాహ్నం 3 గంటలకు అఘాయిత్యం చేశాడని తెలిపింది. 

ఆ తర్వాత అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా నిమిషానికోసారి ఎమ్మెల్యే తనకు ఫోన్ చేయడం మొదలుపెట్టాడని బాధితురాలు పేర్కొంది. ఈ ఫోన్ కాల్స్ పై తన భర్త నిలదీయడంతో జరిగిన విషయాన్ని బయటపెట్టానని తెలిపింది.

పెన్ కెమెరాతో రికార్డు చేసి...

ఎమ్మెల్యే ఆదిమూలంకు బుద్ధి చెప్పేందుకు తన భర్త సూచనల ప్రకారం.. ఎమ్మెల్యే పిలవడంతో ఆగస్టు 10న భీమాస్ ప్యారడైజ్ హోటల్ కు పెన్ కెమెరాతో వెళ్లానని బాధితురాలు చెప్పింది. రూమ్ నెంబర్ 105 లో మధ్యాహ్నం 1:30 గంటలకు తనపై జరిగిన అఘాయిత్యాన్ని, ఎమ్మెల్యే ఆదిమూలం కామ క్రీడలను పెన్ కెమెరాలో రికార్డు చేసి భర్తకు అప్పగించినట్లు వివరించింది. 

ఈ వీడియోను తాజాగా బయటపెట్టానని, మీడియా సమక్షంలో చంద్రబాబుకు పంపిస్తున్నానని చెప్పింది. కామాంధుడు ఎమ్మెల్యే ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది.


More Telugu News