ప్రారంభోత్సవం రోజునే షాపింగ్ మాల్ లూటీ... పాకిస్థాన్ లో అరాచకం!
- కరాచీలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి పోటెత్తిన జనం
- అందినకాడికి వస్తువులు తీసుకొని పరార్
- అరగంటలో షాపింగ్ మాల్ మొత్తం ఖాళీ
పాకిస్థాన్‌లో ఓ ఆరాచక ఘటన జరిగింది. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం రోజునే యజమానికి ఊహించని షాక్ ఎదురైంది. సాధారణంగా షాపింగ్ మాల్స్ లో గానీ ఇతరత్రా షాపుల్లో గానీ కస్టమర్లను ఆకర్షించేందుకు, వ్యాపారం బాగా జరిగేందుకు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే డిస్కౌంట్ సేల్ (ఆఫర్లు) ప్రకటిస్తూ ఉంటాయి. అయితే పాకిస్థాన్ లోని కరాచీలో కొత్తగా ప్రారంభించిన షాపింగ్ మాల్ యాజమాన్యం తొలి రోజే వినియోగదారులను ఆకట్టుకునేందుకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.
మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా రూ.50 కంటే తక్కువ ధరలకే వివిధ వస్తువులు విక్రయిస్తామంటూ యాజమాన్యం ముందుగా ప్రచారం చేసింది. దీంతో పెద్ద ఎత్తున జనం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఇంత భారీ సంఖ్యలో జనాలు రావడంతో వ్యాపారం బాగా అవుతుందని యజమాని సంతోషంలో ఉన్న సమయంలో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. వచ్చిన జనాలు కొనుగోలు చేయకుండా ఎవరికందిన వస్తువులు వాళ్లు తీసుకుకెళ్లిపోయారు. దీంతో అరగంటలోనే మాల్ మొత్తం ఖాళీ అయింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.