రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన సాయి దుర్గ తేజ్
- రెండు తెలుగు రాష్ట్రాలకు రూ. 10 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన సాయి తేజ్
- అమ్మ ఆశ్రమం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు రూ. 5 లక్షల విరాళం
- విపత్తు కష్టాలు త్వరగా తొలగిపోవాలని కోరుకుంటున్నానన్న సాయి తేజ్
కుండపోత వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. రెండు రాష్ట్రాలకు భారీగా విరాళాలను ప్రకటిస్తున్నారు. తాజాగా మెగా హీరో సాయి దుర్గ తేజ్ రూ. 25 లక్షల విరాళం ఇస్తున్నట్టు తెలిపారు.
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధులకు చెరో రూ. 10 లక్షల చొప్పున ఇస్తున్నట్టు సాయి తేజ్ ప్రకటించారు. దీంతోపాటు విజయవాడలో తాను, మెగా అభిమానులు, జనసైనికులు నడిపిస్తున్న అమ్మ ఆశ్రమం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు రూ. 5 లక్షల విరాళం అందిస్తున్నానని తెలిపారు. విపత్తు కష్టాలన్నీ త్వరగా సమసిపోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు.
సాయి ధరమ్ తేజ్ ఇటీవల తన పేరును సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్న సంగతి తెలిసిందే. తన తల్లి విజయదుర్గ పేరులోని దుర్గ అనే పదాన్ని తన పేరు మధ్యలో చేర్చుకున్నారు.