గండ్లు పూడ్చేంత వరకు ఇక్కడి నుంచి కదలను: నిమ్మల రామానాయుడు
- బుడమేరుకు మూడు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయన్న నిమ్మల
- వరదలకు ఇదే కారణమన్న మంత్రి
- బుడమేరు నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శ
బుడమేరుకు మూడు ప్రాంతాల్లో గండ్లు పడటం వల్లే విజయవాడలోని పలు ప్రాంతాలు నీట మునిగాయని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గండ్లు పూడ్చేంత వరకు తాను ఇక్కడి నుంచి కదలనని చెప్పారు.
సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, ఆంధ్రప్రభ కాలనీ, జక్కంపూడి తదితర ప్రాంతాలు జలమయమయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకు ఇక్కడే ఉంటానని చెప్పారు. విజయవాడ వరదలకు గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. బుడమేరు నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు.