బొత్స సత్యనారాయణకు నిరసన సెగ
- విజయవాడలో వరద బాధితులను పరామర్శించిన బొత్స
- ఐదు రోజుల తర్వాత ఎందుకొచ్చారని ప్రశ్నించిన బాధితులు
- సాయం అందకుండా అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం
వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. ఈ సాయంత్రం విజయవాడలోని రాజరాజేశ్వరిపేటలో వరద బాధితులను బొత్స పరామర్శించారు. ఈ సందర్భంగా వరద బాధితులు ఆయనను నిలదీశారు.
తమ ప్రాంతంలో ఇళ్లు మునిగిన ఐదు రోజుల తర్వాత ఎందుకొచ్చారని బొత్సను బాధితులు నిలదీశారు. ప్రభుత్వం అందిస్తున్న సాయం తమకు అందకుండా అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు ఇప్పటి వరకు వైసీపీ ఏం చేసిందని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా బొత్స స్పందిస్తూ... "అధికారంలో లేనివాళ్లం... ఏం చేస్తాం?" అంటూ అక్కడి నుంచి కదిలారు.