వరద బాధితులకు రూ.120 కోట్ల భారీ విరాళం ప్రకటించిన ఏపీ ఎన్జీవో
- ఏపీలో ఇటీవల భారీ వర్షాలు
- విజయవాడ ప్రాంతంలో వరద బీభత్సం
- లక్షలాది మందిపై వరద ఎఫెక్ట్
- ఒక రోజు వేతనాన్ని విరాళం ఇచ్చిన ఏపీ ఉద్యోగులు
ఏపీ ఉద్యోగులు వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించారు. తమ ఒకరోజు వేతనాన్ని వారు విరాళంగా ఇచ్చారు. ఎపీ ఎన్జీవో జేఏసీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.120 కోట్ల విరాళం అందించింది. ఈ మేరకు ఏపీ ఎన్జీవో నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విరాళం అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏపీ ఎన్జీవో జేఏసీని అభినందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రంగాల వరకు ముందుకు వస్తున్నారని తెలిపారు. వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏపీ ఎన్జీవో జేఏసీని అభినందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రంగాల వరకు ముందుకు వస్తున్నారని తెలిపారు. వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు.