టీడీపీ కార్యాలయంపై దాడి కేసు... వైసీపీ నేతలకు హైకోర్టులో ఎదురుదెబ్బ
- 2021 అక్టోబర్ లో టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడి
- కేసుపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం
- కేసులో నిందితులుగా దేవినేని అవినాశ్, నందిగం సురేశ్
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేతలకు నిరాశ ఎదురయింది. వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నందిగం సురేశ్ తదితరులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరికి బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది.
తాము సుప్రీంకోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకునేంత వరకు... తమను రెండు వారాల పాటు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును వైసీపీ నేతలు కోరారు. అయితే, వీరి విన్నపాన్ని హైకోర్టు కొట్టివేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది.
2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుపై దృష్టి సారించింది.
ఈ ఘటనపై మంగళగిరి రూరల్ పోలీసులు క్రైమ్ నెంబర్ 650/2021గా కేసు నమోదు చేశారు. ఐపీసీ 147,148, 452, 427, 323, 324, 506, 326, 307, 450, 380, రెడ్‌విత్ 109, 120బీ, 149 తదితర సెక్షన్ల కింద కేసు నమోదయింది.
మొత్తం 106 మందికి టీడీపీ కార్యాలయంపై దాడిలో ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఇప్పటి వరకు 21 మందిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. మిగతా 85 మందికి మంగళగిరి రూరల్ పోలీసులు ఈ నెల 19 నుంచి నోటీసులు పంపించారు.