తెలంగాణకు రూ.1 కోటి, ఏపీలోని 400 పంచాయతీలకు రూ.4 కోట్ల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్

  • తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు చెప్పిన పవన్ కల్యాణ్
  • ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి ప్రకటించిన ఏపీ డీప్యూటీ సీఎం
  • 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి రూ.1 లక్ష చొప్పున విరాళం
తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు కోటి రూపాయలు ఇస్తానన్నారు. అలాగే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు రూ.1 కోటి ఇస్తానని ప్రకటించారు. అలాగే ఏపీలోని 400 పంచాయతీలకు రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.4 కోట్లు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. వరద బాధితులకు మొత్తంగా రూ.6 కోట్లు ఇస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.


More Telugu News