విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద

  • బుడమేరులో నిన్న వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం
  • ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉందన్న అధికారులు
  • గండ్లను పూడ్చే పనులను పర్యవేక్షిస్తున్న లోకేశ్
విజయవాడను చిగురుటాకులా వణికించిన బుడమేరుకు మళ్లీ వరద పెరుగుతోంది. నిన్న బుడమేరులో వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. కానీ, ఈరోజు వరద ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతం నుంచి 8 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు తెలిపారు. గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం 3 అడుగులకు చేరింది. ఇప్పటికి ఒక గండిని పూడ్చారు. మిగిలిన రెండు గండ్లను పూడ్చే పనులు జరుగుతున్నాయి. పనులను మంత్రులు నారా లోకేశ్, నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. గండ్లను పూడ్చే ప్రక్రియను పర్యవేక్షించాలని నిమ్మల రామానాయుడిని లోకేశ్ కోరారు.


More Telugu News