ప్రభాస్, అల్లు అర్జున్ ఉదారత.. భారీ విరాళాలు ప్రకటించిన స్టార్స్!
- భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అస్తవ్యస్తం
- వరద బాధితులకు టాలీవుడ్‌కి చెందిన ప్రముఖుల ఆపన్నహస్తం
- ఇప్పటికే చిరు, ఎన్‌టీఆర్, మహేశ్ బాబు సహా ఇతర నటీనటుల విరాళాలు
- ఇప్పుడు ప్రభాస్ రూ.2కోట్లు, బన్నీ రూ.కోటి విరాళం
భారీ వర్షాల కారణంగా అస్తవ్యస్తమైన రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌లకు భారీగా విరాళాలు అందిస్తూ ఉదారతను చాటుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ఎన్‌టీఆర్, మహేశ్ బాబు సహా ఇతర నటీనటులు విరాళాలు ప్రకటించారు.
తాజాగా నటులు ప్రభాస్, అల్లు అర్జున్ సీఎం సహాయనిధికి విరాళాలు ఇచ్చారు. ప్రభాస్ రూ. 2కోట్లు విరాళంగా అందించనున్నట్లు ఆయన టీమ్ తెలిపింది. ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌లకు చెరో రూ. కోటి ఇవ్వనున్నట్లు పేర్కొంది.
అలాగే బన్నీ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఈ కష్ట సమయం తొలిగిపోయి, రెండు రాష్ట్రాల ప్రజలు ఆనందంగా ఉండాలని తాను దేవుణ్ని ప్రార్థిస్తున్నానని బన్నీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
"ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని చూసి నేను బాధపడ్డాను. ఈ విపత్కర సమయంలో సహాయ చర్యలకు మద్దతుగా రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌లకు మొత్తం రూ.కోటి విరాళంగా ఇస్తున్నాను. ఈ విపత్తు నుంచి అందరూ సురక్షితంగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని అల్లు అర్జున్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.