ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి 'కమిటీ కుర్రోళ్లు'
- ఆగస్టు 9న విడుదలైన 'కమిటీ కుర్రోళ్లు'
- థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్
- నిహారిక నిర్మాతగా వ్యవహరించిన సినిమా
- త్వరలో ఈటీవీ విన్ నుంచి జరగనున్న స్ట్రీమింగ్
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి ఎక్కువమంది దృష్టిని ఆకర్శించినదిగా 'కమిటీ కుర్రోళ్లు' కనిపిస్తుంది. ఆగస్టు 9వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. నిహారిక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాతో, యదు వంశీ దర్శకుడిగా పరిచయమయ్యాడు. కొత్త కుర్రాళ్లతో వచ్చినప్పటికీ ఈ సినిమా యూత్ కి కనెక్ట్ అయింది. కంటెంట్ పరంగా మంచి మార్కులు దక్కించుకుంది.
అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'ఈటీవీ విన్' వారు దక్కించుకున్నారు. త్వరలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ గురు .. శుక్రవారాలలో ఈ సినిమాను వదిలే అవకాశాలైతే ఉన్నాయి. అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, సందీప్ సరోజ్ .. యశ్వంత్ పెండ్యాల .. ఈశ్వర్ రాచిరాజు .. త్రినాథ్ వర్మ .. ప్రసాద్ బెహరా ప్రధానమైన పాత్రలను పోషిచారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో ఈ కథ నడుస్తుంది. ప్రతి ఏడాది కంటే ఈ సారి అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించాలని ఆ ఊరి సర్పంచ్ బుజ్జి (సాయి కుమార్), అతని కుమారుడు శివ (సందీప్ సరోజ్) నిర్ణయిస్తారు. అయితే ఈ ఉత్సవాలు కిశోర్ కుమార్ తో ముడిపడి ఉంటాయి. అతను ఎవరు? ఆ ఊరికి దూరంగా అతను ఎందుకున్నాడు? అనేది కథలోని ప్రధానమైన అంశం. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.