భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీలో మాజీ వికెట్ కీపర్ కు చోటు
- భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా అజయ్ రాత్రాను ఎంపిక చేసిన బీసీసీఐ
- సలీల్ అంకోలా తప్పుకోవడంతో అజయ్ రాత్రాకు అవకాశం
- భారత, అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి ట్రాక్ రికార్డు కారణంగా అజయ్ రాత్రాను నియమించినట్లు వెల్లడి
మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా భారత క్రికెట్ టీమ్ ఎంపిక కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. బీసీసీఐ సలహా కమిటీ అతనిని ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత కమిటీలో సభ్యుడిగా ఉన్న సలీల్ అంకోలా తప్పుకోవడంతో ఆ స్థానాన్ని అజయ్‌తో బీసీసీఐ భర్తీ చేసింది. దీంతో అజయ్ రాత్రా కొత్త సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఈ క్రమంలో అజయ్ రాత్రా ట్రాక్ రికార్డును బీసీసీఐ వెల్లడించింది. భారత్ టీమ్ తరపున గతంలో అజయ్ రాత్రా వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా పలు దేశీయ, అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి ట్రాక్ రికార్డు కలిగి ఉన్నట్లు బీసీసీఐ పేర్కొంది. భారత్ తరపున ఆరు టెస్టులు, 12 వన్డేల్లో అజయ్ ఆడారు.
హర్యానా నుండి ప్రాతినిధ్యం వహించి 90 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడారని, దాదాపు నాలుగు వేల పరుగులు చేసి 240 వికెట్లు తీశాడని చెప్పింది. అస్సాం, పంజాబ్, యూపీలకు హెడ్ కోచ్ గా పని చేసిన అపారమైన అనుభవం ఉన్నట్లు పేర్కొంది. 2023లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కోచింగ్ స్టాఫ్‌లో కూడా అజయ్ పని చేసినట్లు బీసీసీఐ తెలిపింది.