భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి ప్రవాహం
- ఎగువ నుంచి వస్తున్న వరదతో పెరుగుతున్న నీటిమట్టం
- అర్ధరాత్రి వరకు 43 అడుగులకు చేరుకోవచ్చునని అంచనా
- అప్పుడు మొదటి ప్రాద హెచ్చరిక జారీ చేసే అవకాశం
భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు నీటిమట్టం 39 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నేటి అర్ధరాత్రికి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవచ్చునని అధికారులు చెబుతున్నారు. అప్పుడు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశముంది.
భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలకు సూచనలు చేశారు. కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.