వరద సహాయక చర్యల కోసం రూ.30 లక్షల విరాళం ఇచ్చిన తెలంగాణ గవర్నర్

  • తన నిధుల్లో నుంచి రెడ్ క్రాస్ సొసైటీకి ఇచ్చిన గవర్నర్
  • తక్షణ వరద సాయం అందించాలని సూచన
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసిన గవర్నర్
తెలంగాణలో భారీ వర్షాలు, వరదల వల్ల పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ప్రాణనష్టం కూడా సంభవించింది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు వరద సహాయక చర్యల కోసం విరాళాలు ప్రకటిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సహాయక చర్యల కోసం రూ.30 లక్షల విరాళం ఇచ్చారు.

తన నిధుల్లో నుంచి ముప్పై లక్షల రూపాయలను రెడ్ క్రాస్ సొసైటికి ఇచ్చారు. తక్షణ వరద సహాయం అందించాలని ఆయన రెడ్ క్రాస్ సొసైటీకి సూచించారు.

అదే సమయంలో భారీగా కురుస్తున్న వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెడ్ క్రాస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ఎస్ఎస్, ఎన్జీవోలు ప్రభుత్వంతో కలిసి పని చేయాలన్నారు. భయాందోళన అవసరం లేదని ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చెప్పారని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.


More Telugu News