బ్రూనై చేరుకున్న ప్రధాని మోదీ

  • బ్రూనై రాజధాని బందర్ సేరి బేగవాన్ లో మోదీకి ఘనస్వాగతం
  • ఓ భారత ప్రధాని బ్రూనైలో ద్వైపాక్షిక పర్యటనకు వెళ్లడం ఇదే ప్రథమం
  • భారత్-బ్రూనై మధ్య దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు పూర్తి
ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్నేయాసియా దేశం బ్రూనై చేరుకున్నారు. బ్రూనై రాజధాని బందర్ సేరి బేగవాన్ లో ఆయనకు ఘనస్వాగతం లభించింది. బ్రూనై యువరాజు, సీనియర్ మంత్రి హాజీ అల్ ముహ్ తాదీ బిల్లా భారత ప్రధాని మోదీకి లాంఛనంగా స్వాగతం పలికారు. బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బొల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రూనై పర్యటనకు వెళ్లారు. 

కాగా, ఈ పర్యటనకు చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఓ భారత ప్రధాని బ్రూనై దేశానికి ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం వెళ్లడం ఇదే ప్రథమం. భారత్-బ్రూనై మధ్య దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు పూర్తయిన సందర్భం కూడా మోదీ పర్యటనకు విశిష్టతను చేకూర్చింది.


More Telugu News