కష్టాల్లో నేను .. శైలజ అనుకున్నది అదే: శుభలేఖ సుధాకర్
- నటుడిగా సుధాకర్ కి మంచి పేరు
- మధ్యలో వచ్చిన గ్యాప్ గురించిన ప్రస్తావన
- చాలా ఇబ్బందులు పడ్డామని వెల్లడి
- ఎవరి దగ్గర చేయిచాచలేదని వివరణ
శుభలేఖ సుధాకర్ .. నటుడిగా సుదీర్ఘమైన కెరియర్ ఆయన సొంతం. 'శివ' సినిమాతో ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది. అయితే చాలా సినిమాలు చేసిన తరువాత కూడా తాను ఉద్యోగం కోసం తిరిగానంటూ తాజాగా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. "నేను ఆర్టిస్టునని అందరికీ తెలుసు .. శైలజ సింగర్ అనీ తెలుసు. అలాంటప్పుడు అవకాశాలు ఇవ్వమని ప్రత్యేకంగా అడిగేదేముంటుంది" అని అన్నారు.
" చాల సినిమాలు చేసిన తరువాత కూడా, నేను మొదటి పనిచేసిన హోటల్ కి వెళ్లి మళ్లీ జాబ్ ఇవ్వమని అడిగితే నవ్వారు. చిన్న చిన్న బిజినెస్ లు చేసుకుంటున్న నా పాత మిత్రులను కూడా పని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇంత ఇబ్బంది పడుతున్నా మేము బాలూగారిని సాయం అడగలేదు. అడిగితే నొచ్చుకుంటామని ఆయన అడగకపోవచ్చు" అని అన్నారు.
" ఒకసారి చేయి చాచితే అది అలవాటై పోతుంది. అందువలన ఎప్పటికీ అలాంటి పనిచేయకూడదని నిర్ణయించుకున్నాము. ఆ పరిస్థితుల్లోనే టెలివిజన్ వైపు నుంచి అవకాశాలు వచ్చాయి. అలా టెలివిజన్ అనేది ఆదుకోవడం వలన నా జీవితం గుట్టుగా సాగుతూ వెళ్లింది. నాలాంటి ఎంతోమందిని టెలివిజన్ ఆదుకుంది. అందువలన టెలివిజన్ కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని చెప్పారు.