వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిఫ్ ఫైనల్ తేదీ, వేదిక ఇవే...

  • 2025 జూన్ 11 నుంచి 15వ తేదీ వరకు ఫైనల్ మ్యాచ్
  • జూన్ 16ను రిజర్వ్ డేగా ప్రకటించిన ఐసీసీ
  • వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ పైనల్‌కు లార్డ్స్ వేదిక కావడం ఇదే తొలిసారి
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తేదీని, వేదికను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ జూన్ 11 నుంచి 15వ తేదీ (2025) వరకు లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుందని తెలిపింది. జూన్ 16ను రిజర్వ్ డేగా ప్రకటించింది. 

లార్డ్స్ మైదానం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వేదిక కావడం ఇదే మొదటిసారి అవుతుంది. 2021లో సౌతాంప్టన్, 2023లో ఓవల్ వేదిక అయ్యాయి. మొదటిసారి న్యూజిలాండ్, రెండోసారి ఆస్ట్రేలియా విజయం సాధించాయి. అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ఎంతోమంది ఐసీసీ మూడో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తేదీ కోసం ఎదురు చూస్తున్నారని ఐసీసీ సీఈవో జియోఫ్ అల్లార్డిస్ తెలిపాడు. 2025 ఎడిషన్ కోసం తేదీలను ప్రకటించినందుకు ఆనందంగా ఉందన్నాడు. టెస్ట్ క్రికెట్ కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తోంది... ఆకర్షిస్తోందన్నాడు. టిక్కెట్లకు డిమాండ్ ఉంటుందని తెలిపాడు.


More Telugu News