రేపు నా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

  • ఏపీలో భారీ వర్షాలు, వరద బీభత్సం
  • 9 మంది మృతి
  • విజయవాడలో 2.76 లక్షల మందిపై వరద ప్రభావం
  • అభిమానులు తన పుట్టినరోజు వేడుకలు జరుపవద్దన్న అయ్యన్న 
  • ఆ ఖర్చుతో వరద బాధితులకు సాయం చేయాలని పిలుపు
ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు సంభవించడం తెలిసిందే. వర్షాలు, వరదల ప్రభావంతో 9 మంది మృతి చెందారు. విజయవాడలో 2.76 లక్షల మంది వరద బాధితులుగా ఉన్నారు. 

ఈ నేపథ్యంలో, ఏపీ అసెంబ్లీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోరాదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 

"తుపాను కారణంగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే రేపు (సెప్టెంబరు 4) నా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. దయచేసి నా అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ఎవరూ కూడా ఎలాంటి వేడుకలు జరుపవద్దు. ఆ ఖర్చుతో వరద బాధితులకు సహాయం చేయాలని నా మనవి" అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు. 


More Telugu News