తెలంగాణలో వరద బాధితులకు ఉద్యోగ సంఘాల విరాళం... రూ.100 కోట్లు
- బాధితులను ఆదుకోవడం కోసం ముందుకొచ్చిన ఉద్యోగ సంఘాలు
- ఒకరోజు వేతనాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయం
- విరాళం ప్రకటించిన ఉద్యోగ సంఘాల నేత లచ్చిరెడ్డి
తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. బాధితులను ఆదుకోవడానికి తెలంగాణ ఉద్యోగ సంఘాలు ముందుకు వచ్చాయి. రాష్ట్రంలోని ఉద్యోగుల తరఫున ఒకరోజు వేతనాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. వీరి ఒకరోజు వేతనం దాదాపు రూ.100 కోట్లు అవుతుంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ప్రకటించారు.
వర్షాల కారణంగా మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గామాత ఆలయం చుట్టూ మంజీరా వరద చేరింది. దీంతో ప్రత్యేక పూజల అనంతరం గర్భగుడిని అర్చకులు మూసేశారు. మంజీరా బ్యారేజీ గేట్లు ఎత్తడంతో ఎప్పుడైనా భారీగా వరద వచ్చే అవకాశముంది. అధికారులు అప్రమత్తమయ్యారు.