మెగా కోడలు ఉపాసనతో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నారా... మహిళలకు గొప్ప అవకాశం
- మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు సాయం చేస్తానన్న ఉపాసన
- కోఫౌండర్ గా బిజినెస్ చేద్దామంటూ యువ మహిళలకు పిలుపు
- దేశ హెల్త్ కేర్ రంగంలో మార్పులు తీసుకొద్దామని వ్యాఖ్య
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తనవంతుగా సాయం చేస్తానని హీరో రాంచరణ్ శ్రీమతి, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ ఉపాసన పేర్కొన్నారు. తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉపాసన పాల్గొని మాట్లాడారు.
హెల్త్ కేర్ రంగంలో మహిళలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. వారు చేపట్టబోయే వ్యాపారానికి కో ఫౌండర్ గా ఉండడంతో పాటు అవసరమైన సాయం అందిస్తానని చెప్పారు. తనతో కలిసి వ్యాపారం చేయడానికి ఔత్సాహిక మహిళలు ముందుకు రావాలని కోరారు.
భారతదేశంలో హెల్త్ కేర్ సిస్టంలో మార్పు తీసుకురావడానికి సహాయం చేస్తానని పేర్కొన్నారు. తాము చేయబోయే వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలను, బిజినెస్ ప్లాన్స్, తనను కోఫౌండర్ గా ఎందుకు కోరుకుంటున్నారనే వివరాలను cofounder@urlife.co.in ద్వారా తనతో పంచుకోవాలంటూ ఉపాసన కోరారు.